బాలసాహిత్యం---57(1): శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, - ఫోన్ : 7013660252.

తెలుగు విశ్వవిద్యాలయం బాల సాహిత్య పురస్కార గ్రహీత బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీమతి కొల్లూరు స్వరాజ్యం వెంకట రమణమ్మ గారు ఆగస్టు 15 1997 న విజయనగరం జిల్లా విజయనగరంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు కీర్తిశేషులు సత్యవాడు శివ రామదాసు గారు, నారాయణ గారు. వీరి కుటుంబం తాత ముత్తాతల నుండి అత్యంత గౌరవనీయమైన కుటుంబం. తాతగారు బ్రిటిష్ కాలంలో సబ్ కలెక్టర్ గా పని చేశారు. ఈమె తండ్రి - పేరు ప్రఖ్యాతులు పొందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్  గా వైజాగ్ లో ఉండేవారు. ఆ కారణంగా రమణమ్మగారు ఒకటవ తరగతి విశాఖపట్నంలోచదువుకున్నారు. వారి తండ్రిగారు ఉద్యోగ రీత్యా బొబ్బిలి వచ్చేసారు. బొబ్బిలిలో గల తాండ్రపాపయ్య పాఠశాలలో 2, 3 తరగతులు చదివారు. మరి నాలుగు, ఐదు తరగతులు చదవకుండానే ఆరవ తరగతి ఎంట్రెన్స్ పరీక్షను బొబ్బిలి  సంస్థానం మల్టీపర్పజ్ ఉన్నత పాఠశాలలో వ్రాసి సెవెంత్ ఫారం వరకూ అక్కడే చదివారు.6,7 తరగతు లు  చదువుతున్నప్పుడు రమణమ్మగారు సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆనాడు నేర్చుకున్న సంగీతమే తర్వాత కాలంలో పాటలు వ్రాసేటప్పుడు ఆమెకు ఉపయోగకరంగా  మారాయి.  విజయనగరం మహారాజా మహిళా కళాశాల  లో బి.ఎస్పీ చదివేందుకు చేరారు. ఆమె బి.ఎస్సీ రెండవ సంవత్సరం చదువుతుండగానే మేనమామ గారితో వివాహం జరిగింది. విశాఖపట్నం క్వీన్ మేరీ టీచర్స్ ట్రైనింగ్ స్కూల్ లో  సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ పొందారు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల కలకత్తాలోనే స్టెల్లా మేరీస్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. వీరు ఎంఏ  తెలుగు, ఎం ఏ  హిందీ, బి.ఇడి, పి.జి డిప్లమో ట్రాన్స్లేషన్ డిగ్రీలను పొంది ఉన్నారు. అంతేకాకుండా హిందీ భాష ప్రవీణ పట్టాను పొందారు. హిందీ భాష  పట్టాను పొందడానికి ముందుగా రమణమ్మ గారి తండ్రి గారు బాల్యం నుండి హిందీ భాషలో బాగా తర్ఫీదునిచ్చారు. వృత్తిరీత్యా కోల్ కతా నగరములో 12 సంవత్సరములు, విశాఖపట్నంలో 25 సంవత్సరములు మొత్తంగా 37 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా, ప్రధానోపాధ్యాయురాలిగా పని చేసి పదవీ విరమణ పొందారు. భారతీయ రైల్వే సంస్థ నుండి మూడు పర్యాయములు ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారాలు పొందారు. కొల్లూరు స్వరాజ్యం వెంకట రమణమ్మ గారు స్వతహాగా రచయిత్రి,  ఈమె బాలసాహిత్యం లోను, ప్రౌఢ సాహిత్యంలోనూ, భక్తి సాహిత్యంలోనూ రచనలు చేయడంలో అందవేసిన చేయి. రవణమ్మ గారు అనేక దిన, వార, మాస పత్రికలలోనూ అనేక వందల రచనలు చేశారు.  అనేక కథలు, కథానికలు, కవితలు, పాటలు, నాటికలు ఇలా అనేకం రాశారు. తనంతట తాను ప్రముఖ రచయిత్రిగా పేరు పొందడమేగాకుండా 2007 లో " బాలబాట" పత్రికను స్థాపించి అనేకమంది యువరచయితలకు,  రచయిత్రులకుజీవంపోసొరు. ప్రాణం పోసారు. అప్పటికి ప్రౌఢ సాహిత్యం లో నేను అనేక రచనలు చేసినా, బాలసాహిత్యం లో  నేను 
బాలుడనే ! " బాలబాట " ప్రారంభ సంచిక ప్రారంభోత్సవ సభకు నన్ను ఆహ్వానించారు. అప్పటికి వెంకటరమణమ్మ గారు ఎవరో నాకు తెలియదు. నేను ఎవరో ఆమెకు తెలియదు. అంటే మా ఇద్దరం వ్యక్తిగతంగా ఒకరికొకరు పరిచయాలు లేవు. అయినా " జైహింద్ " అనే వార పత్రికాసంపాదకులు రమణమ్మ గారి గురించి నాకు, నా గురించి రమణమ్మ గారికి పరిచయం చేసారు. ఆ సభ ప్రారంభోత్స   
వానికి 7 ఆగస్టు 2007 న విశాఖపట్నం వెళ్లి ఆమెను కలిసాను. ఆమె సంస్కారం, సౌమ్యత, ఎదుటివారికిచ్చే గౌరవం, మర్యాద ఆనాటి నుండి ఈనాటి వరకూ రమణమ్మ గారిలో అలానే ఉన్నాయి. ఎంతోమంది రచయితలను తను స్థాపించిన  " బాలబాట" మాసపత్రిక ద్వారా తీర్చి దిద్దారు. ( సశేషం )