బాలసాహిత్యం---57(2)--శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252

శ్రీమతి కొల్లూరు స్వరాజ్యం వెంకట రమణమ్మ గారు ఇప్పటివరకు బాల సాహిత్యములో 26,ప్రౌడ్ సాహిత్యము లో 12, భక్తి సాహిత్యము లో 10 మొత్తంగా 48 పుస్తకాలు వెలువరించారు. అనగనగా, స్వరాజ్య సీమ, దాయి దాయి చందమామ. పుస్తకాలు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాయి. శ్రీమతి రవణమ్మ గారు తెలుగు విశ్వవిద్యా లయం పురస్కారాన్ని కూడా అందుకున్నారు. బుర్రకథలు ఏకపాత్రాభినయ నాలు, కథలు, పాటలు నాటికలు ఒత్తులు లేని బాలగేయాలు, బాలల కథలు మొదలగు అనేక ప్రక్రియలలో చేస్తున్న ఆమె అందుకున్న, బిరుదులు, సత్కారాలు కోకొల్లలు. రమణమ్మ గారు పొందిన బిరుదుల లో కొన్నింటిని చూద్దాం.సాహిత్య సుధ సాహితీ రత్న భారత మహిళా శిరోమణి తెలుగు భాష భూషణ్ బాల సేవిక బాలవికాసిని, బాల ప్రియ విశాఖ ఆణిముత్యం మొదలైన బిరుదులతో సహా అనేక సత్కారాలు పొందారు. ఈమె 13 సంవత్సరాలుగా నిరాటంకంగా తెలుగు పిల్లలు అభివృద్ధికి, తెలుగు భాష రక్షణే ధ్యేయంగా " బాలబాట " బాలల మాస పత్రికను నడిపిస్తున్నారు. అనేక సాహితీ సంస్థలలో తనదైన తాను పొందిన ఈమె రచనలు చేయడం పుస్తకాలు ముద్రించడం పత్రికను నడిపించడమే కాకుండా పిల్లలకు నేర్పించి వేదికలపై ప్రదర్శనలిప్పించడం, రేడియో కార్య క్రమాలను చేయించడం వంటి బృహత్తర  కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎందరెందరినో ప్రోత్సహిస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాలను రచన కార్యశాలలను ఏటేటా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈమె శ్రీ శివానంద బాలవిహార్  వ్యవస్థాపక అధ్యక్షురాలు. " స్నేహ భారతి"  స్త్రీ సంక్షేమ సంస్థ కార్యదర్శి, వ్యవస్థాపకురాలు, "జ్ఞానోదయ బాలవిహార్ " కార్యదర్శిగా కూడా తమ సేవలను అందిస్తున్నారు. ( సశేషం )