భాస్కర శతకము - పద్యం (౬౬ - 66)

ఉత్పలమాల : 
*పాపపుఁద్రోవవాని కొక |  పట్టున మేను వికాస మొందినన్*
*లోపల దర్గుణంబె ప్రబ | లుంగద! నమ్మ గఁగూడ దాతనిన్;*
*బాపట కాయకున్ నునుపు | పైపయిగల్గినఁ కల్గుగాక యే*
*రూపున దానిలోఁగల వి | రుద్ధపుఁజేదు నశించు భాస్కరా!*


తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా


ఏదో ఒక కారణము చేత దుర్మార్గుడు, చెడుగుణములు కలవాని శరీరము బంగారు కాంతులతో మెరసి పోవచ్చు కానీ, ఆతని మనస్సొలో వున్న చెడు లక్షణములు పోవు గదా.  ఎలాగంటే, చేదుపుచ్చకాయ పైనుండి ఎంత నున్నగా వున్నా కూడా లోపల వున్న చేదుగుణము పోదు గదా .....అని భాస్కర శతకకారుని వాక్కు. 
*పుట్టుకతో వచ్చిన బుద్ధి/లక్షణము పుడకలతో గానీ పోదు* అని కదా నానుడి.  *సత్సాగత్యం తోగాని, మంచి వారి పొందుతో గానీ, పరమేశ్వర సాన్నిహిత్యం తో గానీ పుట్టకతో వచ్చిన అవలక్షణాలను పోగొట్టుకొనే ప్రయత్నం చేయవచ్చు ఈ ప్రయత్నం వల్ల పుట్టుకతో వచ్చిన లక్షణాలు పూర్తిగా పోకపోయినా, మన జీవిత గమనం మీద వాటి ప్రభావం చాలావరకు తగ్గి, మనం మంచి మార్గం లోకి వెళ్ళే అవకాశం వుంటుంది.* ఇది సత్యం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss