భాస్కర శతకము - పద్యం (౬౮ - 68)

ఉత్పలమాల : 
*పూరిత సద్గుణంబుగల | పుణ్యున కించుక రూపసంపదల్*
*దూరములైన వానియెడ | దొడ్డఁగజూతురు బుద్ధిమంతు లె*
*ట్లారయ; గొగ్గులైన మరి | యందుల మాధురిచూచి కాదె ఖ*
*ర్జూర ఫలంబులం బ్రియము | చొప్పడ లోకులు గొంట భాస్కరా!*


తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..


మంచి గుణములు కలిగిన వారు, అందముగా లేక పోయినా, బుద్ధిమంతులు, వానిని గౌరవిస్తారు.  ఎలాగంటే, ఖర్జూర పండు చూపులకు అందముగా వుండదు, కానీ అపండు యొక్క తీయదనము బలన అందరూ కూడా చేతిలోకి తీసుకుని తినడానికి ఇష్ట పడతారు కదా.....అని భాస్కర శతకకారుని వాక్కు. 


*మన కళ్ళకు కనిపించే బాహ్య సౌందర్యం కన్నా, మంచి లక్షణలు, నడవడిక వలన వికసించే మానసిక సౌందర్యం గొప్పది.  మనం గౌరవించ వలసింది ఒక వ్యక్తి వద్ద వున్న సద్గుణ సంపత్తిని గానీ, బాహ్య సౌందర్యాన్ని కాదు* ఇది సత్యం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss