భాస్కర శతకము* - పద్యం (౬౯ - 69)

ఉత్పలమాల : 
*ప్రల్లదనంబుచే నెరుక | పాటొక యింతయులేక యెచ్చటన్*
*బల్లిదుడైన సత్ప్రభు న | బద్ధములాడిన ద్రుంగిపోదు, రె*
*ట్లల్ల సభాస్థలిం గుమతు | లై శిశుపాలుఁడు దంతవక్త్రుఁడుం*
*గల్లులు గృష్ణునిం బలికి | కాదె హతంబగుటెల్ల భాస్కరా!*


తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..


ధర్మరాజ రాజసుయ యాగ సభలో శిశుపాలుడు, దంతక్త్రుడు దుష్టబుద్ధితో శ్రీకృష్ణ పరమాత్ముని దుర్భాషలు ఆడటము వలన కృష్ణుని సుదర్శన చక్రానికి బలియై చనిపోతారు.  అలాగే, బలవంతుడు, బుద్ధిమంతుడు ఐన రాజు గురించి, మనిషి గురించి చెడుబుద్ధి గలవాడు దుర్భాషలాడితే, నశిస్తారు.....అని భాస్కర శతకకారుని వాక్కు. 


*మన పెద్దవారు చెప్తారు కదా, "చెరపకురా చెడేవు" అని.  "తాను తీసిన గొతిలో తానే పడతాడు" అని.  అందుకే సాధ్యమైనంత వరకు మనము నలుగురి మంచిని, మేలుని కోరుకుంటూ వుండాలి. అప్పడు అందరితో పాటు మనకు కూడా మంచి జరుగుతుంది.  "అందరూ మంచిగా, సుఖంగా, సంతోషం గా వుండాలి, ఆ అందరిలో మనం వుండాలి".* ఇది సత్యం.


.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss