అవిటవానిగ పుట్టానని
లోకమంతా అరచింది
తన బిడ్డ మణిరత్నమని
అమ్మ ఆశీర్వదం పలికింది !
అవిటవాడ్ని కాదు నేను
సత్యం, ధర్మం పలికి నేను
మమతలన్ని పంచినోడ్ని
మంచి మనసు కలిగినోడ్ని !
అంధుడనై పుట్టినాను
మంచి మనసుతో నేను
విశ్వాన్ని చూడగలను
మహా త్యాగినవ్వ గలను !
కుంటివాడినై పుట్టినాను
కుఠిల భావం లేదు నాకు
కుంటి సాకులు చెప్పలేను
దుష్ట పనులు చేయలేను !
బధిరుడనై పుట్టినాను
చెడు పలుకులు వినలేను
మంచి పనులు చేయగలను
జాతి గౌరవం నిలుపగలను !
మూగవాడిగ పుట్టినాను
చెడు పలుకులు పలకలేను
సత్యాన్ని చంపలేను
చీడపురుగుగ మారలేను !