భాస్కర శతకము - పద్యం (౭౧ - 71)

చంపకమాల : 
*ఫల మతి సూక్ష్మమైన నృ | పాలుఁడు మంచి గుణాఢ్యడైనచో*
*నెలమి వివేకు లాతని క | పేక్షయొనర్తు,  రదెట్లు చంద్రికా*
*విలసనమైనఁ దామనుభ | వింపఁ జకోరము లాసజేరవే*
*చలువగలట్టివాఁడగుటఁ | జందురు నెంతయుగోరి భాస్కరా!*


తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..


చంద్రుని ద్వారా వచ్షే వెన్నెలలో ఆకలి తీర్చే గుణము లేకపోయినా కూడా కేవలము ఆ వెన్నెల ద్వారా వచ్చే చల్లదనము కోసమే చకోరపక్షులు చంద్రుని కోసం ఎదురు చూస్తాయి కదా, అలాగే మంచి గుణములు కలిగి, సమర్ధుడు గా వున్న రాజు / అధికారి వలన మనకు కలిగే లాభము అతి తక్కువగా వుంటుంది అని తెలిసినా కూడా ఆ రాజు / అధికారితో సహవాసం చాలునని గుణవంతులు అనుకుంటారు.....అని భాస్కర శతకకారుని వాక్కు. 


.....ఓం నమో వేంకటేశాయ


Nagarajakumar.mvss