బనగానపల్లెలో రంగయ్య ఉండేవాడు.అతను కుండల వ్యాపారం చేసేవాడు.అతను జాలిగుండె కలవాడు వచ్చిన లాభంలో కొంత అనాధలకు అన్నం పెట్టడానికి వాడేవాడు.ఒకసారి బండి మీద కుండలు తీసుకుని పొరుగూరికి వెళ్ళాడు.రెండు ఊళ్ళు తిరిగినా ఒక్క కుండాఅమ్ముడు పోలేదు.దిగులుగా తిరిగి వస్తుంటేదారిలోఒక అవ్వ చెట్టుక్రింద కూర్చుని కనిపించింది.రంగయ్యను చూసి కుండలన్నీ కావాలని అడిగింది.ధర చెప్పాడు రంగయ్య."నేను ఒక చిలుకనిస్తాను.ఉదయం లేవగానే నిన్ను పేరుతో పిలుస్తుంది.అప్పుడు దాని నోటినుండి ఒక బంగారు నాణెం పడుతుంది.రోజూ ఒకనాణెంఅమ్ముకుని సుఖంగా ఉండొచ్చు"అందిఅవ్వ." ఊరికే వచ్చే ధనం నా కొద్దు.నా కష్టమే నాధనం"అన్నాడు రంగయ్య.అవ్వ కుండలడబ్బు ఇచ్చింది."నేను మాయ దేవతను.నీ దానగుణం నచ్చినీ కుండలన్నీ కొన్నాను.నీకుండలు అమ్ముడు పోకుంటే నీవు అనాధలైన ముసలివారి ఆకలి తీర్చలేవు.కాబట్టి నీ వ్యాపారం ఈరోజునుండి బాగా జరుగుతుంది.విజయనగరం పట్టణానికివెళ్ళు.అక్కడ కుండలు బాగా ఖర్చవుతాయి"అని చెప్పి మాయమైపోయింది.మాయదేవత చెప్పినట్లే జరిగింది.రంగయ్య సేవాగుణమే అతనికి మేలు జరిగేలాచేసింది.బి.లక్ష్మి. 8వ తరగతి.కొత్తపేట(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో వచ్చిన కొత్తపేటకలాలు సంకలనంలో కథ)
మాయదేవత : -బి.లక్ష్మి. 8వ తరగతి.కొత్తపేట