భాస్కర శతకము - పద్యం (౯౦ - 90)

 ఉత్పలమాల: 
 *వంచనయింతలేక యెటు | వంటి మహాత్ముల నాశ్రయించినన్*
*గొంచెమె కాని మేలు సమ | గూడ దదృష్టము లేనివారికిన్;*
*సంచితబుద్ధి బ్రహ్మ నని | శంబును వీఁపున మోఁచునట్టి రా*
*యంచకుఁ దమ్మితూండ్లు దిన | నాయె గదా ఫలమేమి భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
సృష్టి కర్త బ్రహ్మదేవుని తన వీపున ఎల్లప్పుడూ మోస్తూ వుండే రాజహంస, తామర కాడలను తినవలసి వచ్చింది.  బ్రహ్మదేవుని మోసినందువుల్ల రాజహంసకు కలిగిన గొప్ప ఫలమేమీ లేదు.  అలాగే, మనసులో ఎటువంటి దురాలోచనలు లేకుండా, గొప్ప వారైన, శక్తిమంతుని కలిసినా కూడా, మనం చేసుకున్న అదృష్టానకి తగ్గ ఫలమే వస్తుంది కాని, వేరే ఎక్కువగా ఏమీ దొరకదు....అని భాస్కర శతకకారుని వాక్కు.
*"అదృష్టము లేని వానికి శివుడు కూడా సహాయ పడలేలుడు" అని కదా నానుడి.* 
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss