*పట్టు చుఁ దండ్రి యత్యధమ | వర్తనుఁడైనను గాని వానికిం**బుట్టిన పుత్రకుండు తన | పుణ్యవశంబున దొడ్డ ధన్యుఁడౌ;**నెట్టన మర్రివిత్తు మునుపెంతయు | గొంచెము దాన బుట్టునా**చెట్టు మహోన్నతత్వమును | జెందదె శాఖల నిండి భాస్కరా!*తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..ఈ భూమిమీద, తండ్రి ఎంఎతటి నీచ ప్రవత్న, మనస్తత్వం కలిగిన వాడైనా, ఆతని కుమారుడు/సంతానం తను పూర్వ జన్మలో సంపాదించిన పుణ్య ఫలముచేత గొప్పవాడు కాగలడు. ఎలాగంటే, మర్రి చెట్టు యొక్క విత్తనము చాలా చిన్నది. కానీ, చెట్టు రూపం వచ్చిన తరువాత ఎన్నెన్నో శాఖలతో చాలా పెద్ద వృక్షం గా మారి అందరికీ నీడను ఇస్తుంది కదా....అని భాస్కర శతకకారుని వాక్కు.*" ప్రహ్లాద హిరణ్యకశ్యప కథ దీనికి చక్కని ఉదాహరణ. ఎంతో దుర్మార్గ ప్రవర్తన కలిగిన హిరణ్యకశిపుని కి ప్రహ్లాదుడు జన్మించాడు కదా. తన సాధన చేత, తన పూర్వ జన్మస్మ్రతి చేత పరమేశ్వరుని కి దగ్గరగా వెళ్ళి, తనను ఉద్ధరించుకుని, తన తండ్రి ని, తన వంశాన్ని కూడా వుద్ధరించాడు కదా. సప్తగిరీశడు కూడా తనకున్న అన్ని పేర్లలో "ప్రహ్లాద వరద గోవిందా", "ఆంజనేయ వరద గోవిందా" అని పిలిస్తే, చాలా సంతోషపడతాడట. ఒక రాక్షసుని కి పుట్టి, వంశాన్నే ఉద్ధరించాడు కదా.*.....ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
భాస్కర శతకము - పద్యం (౯౧ - 91)