కొత్త సంవత్సరానికి...స్వాగతం...సుస్వాగతం..:-పోలయ్య కవి కూకట్లపల్లి హైదరాబాద్..... 9110784502

 కోవిడ్ కొట్టిన కొరడా దెబ్బలతో
గత సంవత్సరమంతా గాయాలమయం
అందుకే రానున్న ఈ కొత్తసంవత్సరమైనా
నిన్న వేధించిన మీ వ్యధలను బాధలను
పరిమళించే పూలమాలలుగా మార్చాలని...
నిన్నటి మీ కష్టాలన్నిటిని కరిగించాలని...
మీరు తలపెట్టిన సకల శుభకార్యాలు
నిర్విఘ్నంగా కొనసాగి సఫలమవ్వాలని...
చింతల చీకాకుల చిమ్మచీకట్లను చీల్చివేసి 
వెన్నెలవెలుగుల్ని మీ జీవితాల్లో నింపాలని...
మీరు కోరుకున్న కోరికలన్నీ తీర్చి 
వరాల మూటలను తెచ్చి
పసందైన విజయాల విందుతో 
మిమ్ము అలరించాలని....
అంబరాన్నంటే సుఖసంతోషాల
సంబరాలను మీకు అందించాలని...
అష్టైశ్వర్యాలను,ఆరోగ్యసౌభాగ్యాలను 
కోటివరాలను మీపై కుమ్మరించాలని...
మీకు, మీ కుటుంబ సభ్యులందరికి
ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని...
ఆశతో అర్థిస్తూ...
ఆ కొత్త సంవత్సరానికి...
శుభస్వాగతం పలుకుతూ......
సహృదయులు...సాహితీ ప్రియులు....
గౌరవ సంపాదకులు... శ్రీ  వేదాంత సూరి గారికి....
అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలతో...