సాహిత్యంతో నా సహవాసం: యలమర్తి అనూరాధ--హైద్రాబాద్--చరవాణి:9247260206

అంతర్జాతీయ అంతర్జాల  కార్యక్రమంలోజూమ్ యాప్ లో మాడభూషి సాహిత్య కళా పరిషత్, చెన్నై ,శ్రీ సంపత్ కుమార్  గారు డిసెంబర్ 6-11- 2020వ తేదీన  నిర్వహించిన "సాహిత్యంతో నా సహవాసం" (ప్రసిద్ధ  సాహితీకారుల ఆత్మ కథనం) లో ఈ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మన అల్లాపూర్ కు చెందిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ తన జీవిత సాహిత్య విశేషాలను వివరించారు.పత్రికలు,సంస్థలు,ఇలాంటి కార్యక్రమాల వలనా,తమ రచనల వలనే వెలుగులోకి వచ్చామని తెలిపారు.
     డాక్టర్ గుమ్మడి రామలక్ష్మి గారు వీరిని పరిచయం చేశారు. అనురాధ గారు తన పుస్తకాల గురించి పుట్టుక దగ్గర్నుంచి తన సాహిత్యం ఎలా అభివృద్ధి లోకి వచ్చిందీ తెలియజేశారు. వీరితో పాటు గురజాడ పేరిందేవి, సమ్మెట ఉమాదేవి, శీలా సుభద్రాదేవి తదితరులు పాలుపంచుకున్నారు.
    ముఖ్యంగా యువత విదేశీ సాంప్రదాయాల జోలికి పోకూడదని, పుస్తక పఠనం ద్వారా రచనలు బాగా రాయగలిగే శక్తి వస్తుందని స్త్రీలను గౌరవించాలి అని సందేశం అందించారు.
  శ్రీమతి అనూరాధ తమ ప్రసంగముతో అందరి మన్ననలును అందుకున్నారు.