జమీందారు జయరాజు/సంపదలకు తరుగు లేదు/
పరివారం పదుగురుండె/
హోదాకు తక్కువ లేదు//
అశ్వశాల గల దాతనికి/
అందు గలదు తెలుపు గుర్రం/
వేగంగాను పరుగు తీయు/
గమ్యం చేరు త్వరగాను//
పెంపుడు కుక్క వారిదే/
కనిపించు రాయంసంగ/
పోవుచుండు రాజు వెంట/
ఎంత దూరమైన పోవును//
బస్తీ బయలు దేరె రాజు/
గుర్రంపై స్వారీ చేయుచు/
ఒంటరిగాను సాగి పోవ/
వెంట వచ్చె కుక్క తోడుగా//
కొంత దూరమపుడు పోయె/
అంతలోన అడ్డు తగిలె/
ఎదుట కుక్క నిలచెను/
రాజు మాటేమి వినదుగ//
కొరడాను ఝుళింపింపగను/
తన పట్టు విడువదేమి/
తుపాకీ గురి పెట్టెను/
నుదుట తూటాతో కొట్టెను//
రక్తము స్రవింపగాను/
మూలుగుతు తూలి పడుచు/
బాధ పడలేక పోయెను/
వెను తిరిగి వెళ్లెనదియె//
గుర్రంపై పోయె రాజు/
ధనం సంచి చూడగను/
కనపడక కలత చెందె
తను కూడా మరలి పోయే//
నగదు సంచి మీద పడిన/
విశ్వాసం గల శునకం/
తుది శ్వాసను కనిపింప/
రాజు మనసెంతొ చెదిరె//
తన పై వస్త్రం చింపేసి/
తలపై కట్టు కట్టి వేసె/
ప్రధమ చికిత్సను చేసె/
గుర్రంపై వేసె వెడలెను//
జంతు వైద్యశాలకు పోయి/
వైద్యుడంత చికిత్స చేయ/
ప్రాణాపాయం తప్పెను/
రాజు మది సంతసించెను//
నోరులేని జీవియైన అదీ/
ప్రేమనెంత పెంచుకున్న ది/
తనదైన తొందరపాటుదనం/
ఎంత హాని తెచ్చెనని వగచె//
తొందరపాటు(బాలగేయం): - -బెహరా ఉమామహేశ్వరరావు.సెల్ నెం:9290061336