సాక్షి శతకము(భక్తి శతకము):-బెహరా ఉమామహేశ్వరరావు. సెల్ : 9290061336*

 శ్రీ  సాక్షి శతకము
శ్రీ మద్గురు  స్వరూపం
స్వామీ మీ చరణ సేవ సల్పినదాదిన్
కోమల హృదయ పవిత్రత
నీ మహిమను గలిగె నిజము నిర్మలవర్యా// (1)
         తామిచ్చిన శివమంత్ర మ
          పారంబగు సర్వ లక్షణ కవచం బాయెన్
          శ్రీరామ తారకము అత్యా
          దరమగు సునిత శక్తి కాకరమయ్యెన్//(2)
గురు దేవా నేనిప్పుడు
అరయంగా సాక్షి శతకము పేరిటనే
తిరుగు సంకల్పముచే
పరమేష్టికి మ్రొక్కి వ్రాయ బూనితి భక్తిన్//(3)
         గజముఖుని గౌరి దేవిని
         అజు రాణిని ఆదిలక్ష్మి నందరితలతున్
         సృజియింప బెంప జంపను
       అజుడాదిగ హరిహరులను అవనినుతింతున్//
                                                               (4)      ఈ శతక కందపద్యము
లాసతో  సమకూర్చి శతకమాద్యంతంబున్
దాసుల హృదయ నివాసుం
డా సర్వేశునకు కృతిని అంకిత మిడితిన్//(5)
       శ్రీ లక్ష్మీ ప్రియ వల్లభ
       లీల వినోదుడవనంత నిర్మలమూర్తీ
       పాలన్ముంచిన సరియే
       నీలను ముంచినను సరియె నిజముగ సాక్షీ (6)
సర్వేశ్వర సర్వాత్మక
సర్వ జగన్నాధ వినుత సర్వాధారా
సర్వము నీవై వెలసిన
సర్వ సాక్షి శ్రీ రమేశ స్వామీ సాక్షి//(7)
   సర్వ సముండవు అంతట
    సర్వవ్యాపకుడవనుచు సకలము నుడువన్
   గర్వముడిగి నిను వేడితి
   సర్వాత్మక నన్ను కరుణ సాకులు//(8)
నీ కరుణయె సర్వస్వము
లోకములో అన్ని నీవె లోకారాఢ్యా
ప్రాకటముగ మము గావుము(9)