అమ్మ చీరకొంగు .....:----రాజేష్ మిట్టపల్లి--9441672957

 నాటి కాలం నుంచి, నేటి కాలం వరకు హిందూ సంస్కృతిలో  అమ్మ చీరకొంగు కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రత్యేక స్థానాన్ని నాటి తరం గుర్తించకపోవడం బాధాకరం. నాటి స్త్రీలకు ఫ్యాషన్ దుస్తులపై మక్కువతో అమ్మ చీర కొంగు ప్రత్యేకతను మర్చిపోతున్నారు. ఒక్కసారి అమ్మ చీర కొంగు ప్రత్యేకతను చూద్దాం... మన చిన్నతనంలో ఫ్రెండ్స్ తోటి ఆటలు ఆడి  ఇంటికి వస్తే మన ముఖం మీద ఉన్న చెమటను అమ్మ కొంగు తో తుడుస్తుంది. ఆ తుడిచే విధానంలో అమ్మ ప్రేమ ఇమిడి ఉంటుంది.  చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తే , ఎవరైనా దండించడానికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు తల్లి కొంగు వెనకాల దాక్కుంటాడు. మనకు జ్వరం వచ్చి చలి పెడితే అమ్మ చీర కొంగుతో  కప్పుతుంది. మనకు జలుబు చేసి ముక్కు వెంట సిముడు కారుతుంటే, అమ్మ తన కొంగుతో తుడుస్తుంది.  చిన్న తనంలో మనకు ఒక రూపాయి కావాలని మారం చేస్తే అమ్మ తన కొంగులో ముడి వేసుకున్న రూపాయిని విప్పి ఇస్తుంది.. ఆ రూపాయి తీసుకొని మనం ఎంతో సంతోషంగా వెళ్ళి రూపాయి తో సక్లెట్స్ కొనుకుంటాము. ఆ చాక్లెట్స్ కొనుక్కొని అమ్మ దగ్గరకు వంచి తింటుంటే అమ్మ ఎంతో మురిసి పోతుంది. ఆ చాక్లెట్స్ తింటుంటే ఈగలు వాలుతుంటే అమ్మ కొంగుతో ఈగలను కొడుతుంది. చలికాలంలో చలికి వోనుకుతుంటే అమ్మ కొంగుతో నీ పై కప్పి నీ చలిని వెళ్లగొడుతుంది.  నీకు ఆకలి వేస్తే తన కొంగు లో అన్నం అడుక్కొని వచ్చి నీ ఆకలి తీరుస్తుంది.  ఇంట్లో కూరగాయలు అయిన,  పొయ్యిలో కట్టెల కైనా అమ్మ కొంగే ఉపయోగ పడుతుంది. మనం బాధలో  ఉండి ఏడుస్తుంటే , అమ్మ కొంగుతో తుడుస్తుంది.  అమ్మ కొంగు వెనకాల మన ఊహకందని గొప్పదనం ఉంటుంది. ఏమంటే. అమ్మంటే ఒక వేదం, అమ్మ అంటే ఒక భక్తి భావం, అమ్మ ఒక ప్రేమ రూపం, అమ్మ ఒక సంవేదన, అమ్మ ఒక భావన, అమ్మ ఒక పుస్తకం, అమ్మ ఒక కలం, అమ్మ ఒక కవిత, అమ్మ ఒక జ్ఞానం, అమ్మ ఒక గుడిలో దీపం, అమ్మ ఒక హారతి పళ్లెం, అమ్మ ఒక సుకుసుమం, అమ్మ ఒక చల్లని చిరుగాలి, అమ్మ ఒక అన్నపూర్ణ, అమ్మ ఒక లాలిత్యం, అమ్మ ఒక కరుణ, అమ్మ ఒక దీవెన, అమ్మ ఒక అక్షిత, అమ్మ ఒక  వర్షపు బిందువు,. అమ్మ ఒక మధుర గేయం, అమ్మ ఒక శ్వాస, అన్న ఒక ఊపిరి, అమ్మ ఒక మురళీగానం, అమ్మ ఒక జోల పాట, అమ్మ ఒక పచ్చదనం, అమ్మ ఒక కనురెప్ప, అమ్మ ఒక దేవత, అమ్మ ఒక పుడమి, అమ్మ ఒక స్వచ్ఛత, అమ్మ ఒక ప్రవచనం, అమ్మ ఒక వెలుగు, అమ్మ ఒక సుగుణం, అమ్మ ఒక నమ్మకం, అమ్మ ఒక ఆరోగ్యం, అమ్మ ఒక భద్రత. ఈ విధంగా ప్రతి అంశం వెనుకాల అమ్మ చీర కొంగు ప్రత్యేకత దాగి ఉంది.