దేశభక్తి : -రావిపళ్లి వాసుదేవరావు పార్వతీపురం 9441713136

పిల్లలం మేం పిడుగులం 
మేం రేపటి పౌరు లమ్ 
దేశమాత ద్రోహులను 
శిక్షించే సైనికులం 


ఉడతలం మేం బుడత లం
 భారతమాత భక్తులం 
శత్రుమూక కుయుక్తలను 
తిప్పికొట్టే సారధులం 


వీరులం మేం ధీరులం
మేం వానర పటాలం
 ఉగ్రరాక్షసులందరిని 
ఎదిరించే శూరులం 


పుత్రులం మేం మిత్రులం 
అమ్మ ప్రేమ పాత్రులం
ఎటువంటి ఆపదైనా
ఎదుర్కొనే శాత్రులం