హల్లులతో(గేయము)రావిపల్లి వాసుదేవ రావు, పార్వతీ పురం 9441713136.
 క ఖ లను నేర్చుకో
కలిసి మెలిసి సాగిపో 
గ ఘ లను నేర్చుకో 
గురు దీవెన అందుకో 
చ ఛ లను నేర్చుకో 
చదువు విలువ తెలుసుకో 
జ ఝ లను నేర్చుకో 
జాలి కలిగి మసలుకో 
త థ లను నేర్చుకో 
తప్పు చేయ మానుకో 
ద ధ లను నేర్చుకో 
ధనము విలువ తెలుసుకో 
'న'  ను నీవు నేర్చుకో 
నగవులతో మురిసిపో 
ప ప లను నేర్చుకో 
పచ్చదనం పెంచుకో 
బ భ లను నేర్చుకో 
బడికి వెళ్ళి చదువుకో 
'మ' ను నీవు నేర్చుకో 
మంచితనం పెంచుకో 
'య' ను నీవు నేర్చుకో 
యతి నీ పూజించుకో 
'ర' ను నీవు నేర్చుకో 
రంగు వేసి మురిసిపో 
'ల' ను నీవు నేర్చుకో 
లల్లాయి పాట  పాడుకో 
'వ' ను నీవు నేర్చుకో 
వడి వడిగా సాగిపో 
'శ' ను నీవు నేర్చుకో 
శతకము ను చదువుకో 
'ష' ను నీవు నేర్చుకో 
షడ్జమం లో పాడుకో 
'స' ను నీవు నేర్చుకో 
సమయం విలువ తెలుసుకో 
'హ' ను నీవు నేర్చుకో 
హలము పట్టి దున్నుకో 
'క్ష' ను నీవు నేర్చుకో 
క్షణకాలం ఆగిపో