పరోపకారం: -సంగనభట్ల చిన్న రామకిష్టయ్య- ధర్మపురి 9908554535

  అడవిలో ఒక నక్క తిరుగసాగింది.దానికి ఆహారం ఏమీ దొరకలేదు. అప్పుడు దానికి ఒక చీమ ఎదురైంది.
"నక్క మామా! నక్క మామా! నేను నీకు ఏదైనా సహాయం చేయగలనా!" అని అడిగింది. ఆ మాటను విన్న నక్క పగలబడి నవ్వి "నీవేమిటి!నాకు సహాయం చేయడం ఏమిటి?పో!పో!"అని నవ్వింది. చీమ చిన్న--
బుచ్చుకుంది.నక్క ఆహారం కొరకు అడవి లోపలికి వెళ్లి-
పోయింది.
       కొన్ని రోజులకు నక్కను ఒక పెద్ద పురుగు పట్టుకుని దాని రక్తం పీల్చసాగింది.అది బాధతో "కుయ్యో మొర్రో"అని అరవసాగింది.ఆ పురుగును ఎంత వదిలించుకున్నా దానికి సాధ్యం కాలేదు.అప్పుడు ఇదివరకటి చీమ గమనించి తన గుంపునంతా పిలచింది.ఆ నక్క పైకి చీమలన్నీ ఎక్కి ఆ పురుగును చంపాయి.దానిని క్రిందకు తీసుకుని వచ్చాయి.
       నక్క తన బాధను విముక్తి గావించిన చీమకు కృతజ్ఞతలు తెలుపుతూ "నీవు చిన్న ప్రాణివని దెప్పి పొడిచాను.నీవు నాకు ఈ విధంగా సహాయం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. నన్ను క్షమించు"అని అంది.అప్పుడు చీమ "నక్క మామా!ప్రతివారికి కూడా ఇంకొకరితో అవసరం ఉంటుంది. ఇతరులను అందుకే దెప్పి పొడవవద్దు.అపకారికి ఉపకారం చేయడం లోనే ఆనందం ఉంది. నీవు కూడా నా లాగా ఆచరిస్తే నిన్ను ఈ లోకం పొగడుతుంది.దేవుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడు"అని అంది.ఇకముందు నీవన్నట్లే చేస్తాను" అని అంది.
           నక్కకి వచ్చిన ఆపద చూసి ఇదివరకే గాయపడ్డ 
దాని మిత్రుడైన ఎలుగుబంటి చీమను పంపిన సంగతి పాపం నక్కకి తెలియదు. ఏదేమైనా నక్కలో వచ్చిన ఈ మార్పును చీమ ద్వారా విన్న ఎలుగుబంటి ఎంతో సంతోషించింది.