భవిత మీరే: ---డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.-9948285353.

 భావిభారత పౌరులు మీరే
నా చేతికర్రే మీకు చేయూత.
చెడు వినవద్దు,చెడు చూడవద్దు,చెడు మాట్లాడవద్దు.
ఈ మూడు ప్రమాణాలే మీకు
జీవన కర్తవ్యాలు.
విద్య,వినయం,సంస్కారం
మీరు నేర్వాల్సిన పాఠాలు.
దేశాభివృద్ధి,గ్రామాల పటిష్టత
మీదే ఆధారపడి ఉంది.
సత్యం,స్వచ్ఛత,స్వయంసేవలే
మీ ఆయుధాలై నడవాలి.
అమ్మాయైనా,అబ్బాయైనా
శీలం,క్రమశిక్షణలే రక్షణలు.
భవితమీరే,మీ వెంటే నేను.