క్యాబేజ్.. ఔషధంగా.: - పి .కమలాకర్ రావు

ఎన్నెన్నో పోషక విలువలు ఉన్నటువంటి కూరగాయ లలో క్యాబేజీ ఒకటి. ఇది శరీరంలో వాపులు రాకుండా కాపాడుతుంది. ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో కూడా దీనిని  విరివిగా వాడుతున్నారు. ప్రోస్టేట్ సమస్య ఉన్నవారికి కొందరికి మూత్ర ద్వారంలో వాపు వస్తుంది. మూత్రం బొట్లు బొట్లుగా వస్తుంది. అలాంటి వారు క్యాబేజీని ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసి ఆ ముక్కలను వేయించి జిలకర్ర పొడి వేసి కొద్దిగా నీరు పోసి  ( Half boiled) గా ఉడికించి ఆ ముక్కలను తినాలి. దీనిని వరుసగా 48 రోజులు తినాలి. అలా చేస్తే ప్రోస్టేట్ గ్లాండ్ వాపు పూర్తిగా తగ్గిపోతుంది. మూత్ర ద్వారం విచ్చుకొని మూత్రము ధారాళంగా వస్తుంది.క్యాబేజీ కడుపులోనే అల్సర్ కు మంచి మందుగా పనిచేస్తుంది. అల్సర్ సమస్యతో బాధపడుతున్నవారు క్యాబేజీని ముక్కలుగా కోసి మిక్సీలో వేసి అందులో తియ్యని మజ్జిగ కలిపి పరగడుపున వరుసగా పూర్తిగా తగ్గేంతవరకు త్రాగాలి. అల్సర్ పూర్తిగా తగ్గిపోతుంది.