దీపికా నందనా.....: మొహమ్మద్ .అఫ్సర వలీషా--ద్వారపూడి (తూ గో జి ).

చిన్ని చిన్ని కన్నా అంటూ 
ఎన్ని సార్లు నీకై కలకన్నా......


అల్లి బిల్లి ఆడుతూ 
జాబిల్లినై జత కడుతూ.....


కలిసి మెలిసి మేఘాలను 
మెలి వేసి అలసి సొలసి....


ఊగుతూ తూగుతూ 
ఉయ్యాల జంపాల లూగుతూ....


హే *దీపికా* నందనా
నంద నంద నందనా....
 
ముద్దుల రియాన్ష్ నీకు హృదయపూర్వక జన్మదిన   శుభాకాంక్షలు శుభాభినందనలు ....


ఆశల దీపమా
ఆనంద తరంగమా...


ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో
 మరెన్నో ఆయురారోగ్యాలతో....


సుఖసంతోషాలతో 
సిరి సంపదలతో ....


ఆనందంగా అందరి
ఆత్మీయ ఆశీస్సుల మధ్య ....


జరుపుకోవాలని మనసారా 
కోరుకుంటున్నా...


ప్రేమ తో ఆశీస్సులు 
అంద చేస్తున్నా......!!