అబధ్దపు హామీలు....:-మొహమ్మద్ .అఫ్సర వలీషా-ద్వారపూడి( తూ గో జి )

అప్పట్లో
రాజకీయాలకు తావు లేదు
రా రమ్మంటూ ఓటరుకు
 ఎరవేసే పావు లేదు...


రక్షణ వలయాలై
రక్షించే నేతలే 
మనకు ఆదర్శం....


విచ్ఛిన్న విభజన సమాలోచనం
రాష్ట్రాల విభజన గందరగోళం
రాటుతేలిన ప్రతిపక్షాల ఘీంకారం....


రూపురేఖలే మారిపోయిన
రాజకీయాలు
రోత గా మారిన అవినీతి
పరిపాలనలు...
 
రెండు రెండు పార్టీలుగా
చీలుస్తూ జనాల మధ్య
 చీలికలు ....


రాజకీయాన్నే మార్చేస్తున్న
 దొంగ ఓట్లు
రాతలింతే ననుకుంటున్న
 జనాలు....


రాజకీయాల్లో మంచిని
 చేద్దామనుకున్న 
నేతలు కూడా కుళ్ళు
రాజకీయాలను తప్పించి
 పదవిని రక్షించుకునే 
తీరులో నేతల రాజకీయ 
పదవీ కాలం పరిసమాప్తం...


రాజకీయ నేతలు  అబద్ధపు
 హామీలు ఇవ్వకుండా
ఇచ్చిన హామీలు 
నిలబెట్టుకున్న ప్పుడే
ఓటు విలువ దాయకం అవుతుంది
రక్షణ రాజకీయంగా
చరిత్రలో  నిలుస్తుంది....!!