మాతృత్వం: -- డా. కందేపి రాణి ప్రసాద్

ఆమె ఆమె పేరు అప్సర నిజంగానే సౌందర్యంలో అప్సరస ఆ ఆ సౌందర్యాన్ని చూసుకునే అప్సర చాలా గర్వించే ది ఆమె అందంగా ముస్తాబై వెళ్తుంటే అందరూ ఆమెనే చూసేవారు అది అది చూసి ఆమె చాలా గొప్పగా ఫీల్ అయ్యేది కానీ ఇప్పుడు ఆ స్వప్నం అదిరిపోయింది ఇప్పుడు తనకు అందం దూరమై పోయి అనారోగ్యం దగ్గరయింది అందమే శాశ్వతం అనుకున్నది ఆ అందం కోసమే ప్రేమించే భర్తను కడుపున పుట్టిన బిడ్డను దూరం చేసుకున్నది 
కానీ నీ కాలంతో పాటు అందం కరిగిపోయింది బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రం మిగిలింది అందరూ ఉన్నా ఎవరు లేని అనాధ ఈ క్యాన్సర్ ఆస్పత్రిలో జీవచ్ఛవంలా బ్రతుకు తోంది


         అప్సర కు గతం గుర్తుకు రాసాగింది అప్పట్లో తను ఒక మోడల్ గర్ల్ తన అందం చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుపమ్ అనుపమ్ కు ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు అప్సర మనకు బిడ్డలే వద్దు అనటంతో అరకు పిల్లలు  పుడితే అందం పాడవుతుందని భయం


         పిల్లలు లేని ఇల్లు చెట్లు లేని ఎడారిలో ఉంటుంది బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పది అని ఎన్నో విధాలుగా అనుపం నచ్చ చెప్పడంతో అప్సర ఒక బిడ్డకు మాత్రం అంగీకరించింది అలా బాబు పుట్టాడు
       
           కానీ బాబు పుట్టిన ఆ తర్వాతే అసలు గొడవ మొదలైంది తాను బాబుకు పాలు ఇవ్వను అనగానే అనుపమ్ కోపంతో మండి పడ్డాడు అయినా తన మొండి పట్టు విడవలేదు ఆఖరికి అనుపమ్


         "కడుపున పుట్టిన పిల్లవాడికి కూడా అందం చెడిపోతుందని పాలు ఇవ్వలేదు నీవు అసలు ఆడదానివేనా? పై అందం చూసి నిన్ను పెళ్లి చేసుకొని మోసపోయాను నీకు అందం ముఖ్యమైతే నాకు పిల్లలు ముఖ్యం తల్లి లేని లోటు తెలియకుండా నేనే వాడిని పెంచుతాం అంటూ కోపంగా  పొత్తిళ్లలో ని పసికందు ని తీసుకొని వెళ్ళిపోయాడు


        డాక్టర్ రాకతో అప్సర ఈ లోకం లోకి వచ్చింది డాక్టర్ శోభ అప్సర కు ఇంజక్షన్ ఇస్తూ చూడమ్మా నీవే కాదు చాలామంది పిల్లలకు పాలు ఇస్తే తమ అందం చెడిపోతుందని అనుకుంటారు కానీ ఆ పాలు ఇవ్వకపోతే నే నీకు లాగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వాళ్లకు తెలియదు ఈ సైన్స్ జనం మధ్యకు ఎప్పుడు పోతుందో కానీ అప్పటివరకు ఇంతే అంటూ వెళ్ళిపోయింది


      అప్సర ఆ ఆసుపత్రికి వచ్చినప్పటి నుండి ఆ  రూమ్ లో ఉన్న క్యాలెండర్ వంకే చూస్తూ కాలం గడిపేది ఇప్పుడు కూడా ఆ ఆ క్యాలెండర్ వంకే చూస్తున్నది ఆ ఆ క్యాలెండర్ లో ఒక ఒక విలాసవంతమైన స్త్రీ నీ బొమ్మ దాని పక్కనే తన్మయత్వంతో బిడ్డకు పాలిస్తున్న స్త్రీ బొమ్మ ఉన్నాయి దాని క్రింద ఉన్న అక్షరాలు ఈ రోజు చదివిన ఎప్పటికప్పుడు తనకి క్రొత్త గానే కనిపిస్తాయి


   "మనిషిలోని అందాన్ని కన్నా నా మనసులోనే భావాన్ని చూడు!
మగువలోని సొగసు కన్నా మాతృత్వం మమత చూడు