మనోజ్ ప్రతిభ అద్భుతం : KVM వెంకట్ మొలక ప్రతినిధి వికారాబాద్ జిల్లా

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామం చెందిన మైక్రో ఆర్టిస్ట్ గా సాయి మనోజ్ పెన్సిల్ పై అనేక బొమ్మలు వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు స్థానం సంపాదించారు జిల్లా విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో ప్రశంసలు అందుకున్నారుగిన్నిస్ బుక్ రికార్డ్ లో పేరు సంపాదించుకోవాలని తన లక్ష్యం అంటున్న సాయి మనోజ్ మనోజ్ పై మొలక ప్రత్యేక కథనంవికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ గా పేరు పొందిన సాయి మనోజ్ పెన్సిల్ పై అనేక మైనటువంటి ఆకృతులను చెక్కి అందరి మన్ననలు పొందుతున్నాడు ప్రధానంగా డిగ్రీ చదువుతూ ఖాళీ సమయంలో మొదట సబ్బు ల పైన చిత్రాలు గీయడం నేర్చుకొని అనంతరం పెన్సిల్ పై దేవుళ్ళ బొమ్మలు రాజకీయ నాయకుల బొమ్మలు 15 మంది భారత ప్రధానమంత్రి పేర్లను ఒకే పెన్సిల్ పై చేక్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు లో స్థానం సంపాదించారు ఇటీవల సేవ్ గర్ల్  పైన పెన్సిల్ చేక్కడంతో అందరి మన్ననలు పొందడం జరిగింది ప్రధానంగా  మొలక మాస పత్రిక పేరును కూడా పెన్సిల్ పై చెక్కి తన అభిమానాన్ని చాటారు ఇప్పటివరకు దేశ నాయకులు రాజకీయ నాయకులు దేవుళ్ళ బొమ్మలు వివిధ పేర్లు తెలుగు మరియు ఇంగ్లీష్ లో ని చెక్కి అందరిని అబ్బుర పరిచారు రాబోయే రోజుల్లో గిన్నిస్ బుక్ రికార్డు స్థానం సంపాదించాలని తన లక్ష్యం అంటున్న సాయి మనోజ్ కు"  మొలక" తరపున విష్ యు ఆల్ ద బెస్ట్  చెప్పుదాం