చిన్నారి లీలలు :- వురిమళ్ల సునంద ఖమ్మం

చిట్టి తల్లి మోములో
ఎన్ని హావ భావాలో
చిరునవ్వు మధురంగా నవ్విందా
వెన్నెల్లు జలజలా కురుస్తాయి
చిరుఅలకలే తాను బూనిందా
చెక్కిళ్ళు అరుణిమ దాలుస్తాయి
లేలేత గులాబీ పెదవులపై
అరుణ కాంతులు విరుస్తాయి
సంజ కెంజాయ వన్నెలతో
సర్వం మనల మైమరపిస్తాయి!


చిన్నారి పాపాయి నడిచిందా
మువ్వలే మురిపెంగా మోగుతాయి
పాదముద్రలే పల్లవులై దరువేస్తాయి!
పొన్నారి మాటలు విన్నామంటే
చిలుకల పలుకులే గుర్తొస్తాయి
చిత్రంగా బాల్యాన్ని రప్పిస్తాయి