గట్టి పిట్ట ...:-----డా.కె .ఎల్వీ -- హనంకొండ .

చిట్టిపొట్టి 
పిట్ట ఒకటి 
మా ..
మిద్దెమీద 
వాలింది ..


చిట్టి ..చిట్టి 
అడుగులతో 
అటు ..ఇటు 
తిరుగుతుంది !


దాహమేసి 
నీళ్లకోసం 
అక్కడక్కడే 
తిరుగుతుందని ,


గిన్నెలోన 
నీళ్ళు తెచ్చి ..
గోడమీద 
పెట్టాను ...,


గుప్పెడు 
గింజలు తెచ్చి ,
నేలమీద 
విసిరాను ..!


ఆకలి గొన్న 
బుల్లిపిట్ట 
ఆవురావురు మంటూ 
గింజలన్నీ తిన్నది ,
గిన్నెలోని నీళ్లను 
గమ్మత్తుగా తాగింది !


పక్షిభాషలో 
ఏదోచెప్పబోయి 
నా ముందుకి 
వచ్చి వాలింది 


అనందంగా 
పిట్టను పట్టబోతే 
తుర్రుమని ...పైకి 
ఎగిరిపొయింది !


ఎవరి జాగ్రత్త 
వాళ్లకి అవసరమని 
గుర్తుచేసి పొయింది 
పొట్టిదైన ..
గట్టిపిట్ట ......!!
-------------------------
  ఫోటో లో...బేబీ..ఆన్షి.నల్లి.