గోపాల: :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

గోపాల గోపాల గోపికాలోల
నల్లనయ్యరార నాముద్దు తండ్రి ||గోపాల||
బాలలను బ్రోచేటి బాలగోపాల
మరువక మమ్మేలు మదనగోపాల
సంతునిచ్చేస్వామి సంతానగోపాల
ముక్తినిచ్చేస్వామి మువ్వగోపాల ||గోపాల||
కాళిందిమర్ధన కరుణగోపాల
పూతకినిజంపిన పాలగోపాల
గోవర్ధనమెత్తిన గండగోపాల
వెన్నమీగడదిన్న వేణుగోపాల ||గోపాల||
నామదినిదోచిన నందగోపాల
దీవించిమముగావు దివ్యగోపాల
గోవులగాచేటి గోపాలబాల
కరుణతోమముజూడు కరుణాలవాల ||గోపాల||