ఐక్యత:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

చదవాలీ చదవాలీ
దినపత్రికనూ చదవాలీ
చూడాలీ చూడాలీ
దిన దిన వార్తలు చూడాలీ
పెంచాలీ పెంచాలీ
జ్ఞానము మనలో పెంచాలీ
పంచాలీ పంచాలీ
విజ్ఞానమందరికీ పంచాలీ
మారాలీ మారాలీ
మనమంతా మంచిగ మారాలీ
కూల్చాలీ కూల్చాలీ
కులమతాలనూ కూల్చాలీ
ఉండాలీ ఉండాలీ
మనమంతా ఐక్యంగా ఉండాలీ
పెంచాలీ పెంచాలీ
దేశప్రగతిని పెంచాలీ !!