ఆట వెలది .జాధవ్

మనసు లేని చోట మమకారముండదు
మమత లేక యున్న మనువు యేల
ఆచితూచిచూడ అంతర్యముతెలియు
పుండలీకుమాట పూలబాట


ముక్కు మూసి నరులు మునిగిన గంగలో
మనిషి లోని మైల మాసి పోదు
నీచమైన పనులు  నరుడు  చేయవలదు
పుండలీకుమాట పూలబాట