ఆశ్రమధర్మాలు(పురాణం)డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

బ్రహ్మచర్యం,గార్హస్ధ్యం,వానప్రస్ధం,సన్యాసం అనేవి ఆశ్రమధర్మలు.
బ్రహ్మచర్యం:బ్రహ్మచర్యాన్ని 'సావిత్రం'అంటారు. ఎందుకంటే గాయత్రీ మంత్రోపదేశాన్ని పొంది దాన్ని జపిస్తారు కాబట్టి.ఉపనయం అయిన తరువాత బ్రహ్మచారి మొదటి మూడురోజులు గాయత్రీ మంత్రాన్ని జపించడాన్ని 'ప్రజాపత్యం'అంటారు. తరువాతవేదంలో చెప్పబడిన వాటిని ఆచరించడాన్ని'బ్రహ్మమని'వేదాన్నిసంపూర్ణంగా అధ్యాయనంచేసి అనుష్టానం చేయడాన్ని 'నైష్ఠికమని'అంటారు.
గృహస్ధాశ్రమం:గృహస్తులు నాలుగు రకాలుగా విభజింపబడ్డారు.పొలం పండించుకు తినేవారిని'వార్త'అంటారు.యజ్ఞ సామాగ్రిని సమకూర్చు కోవడాన్ని'సంచయం' అంటారు. గృహస్తుడు ఇతరులను యాచించకుండా జీవించడాన్ని'శాలీనం'అంటారు.పొలంలో రాలిన గింజలు ఏరుకు తిని జీవించేవారిని 'శిలోంఛం' అంటారు.
వానప్రస్తం:కందమూలాలు తిని జీవించేవారిని 'వైఖానసులు'అంటారు. కొత్తపంటచేతికి అందగానే ఇంటఉన్న పాత ధాన్యాన్ని దానంచేసే వారిని 'వాఖల్యులు'అంటారు.రోజుకు ఒక దిక్కున యాచనద్వారా జీవించేవారిని'ఔదుంబరులు'అని, పండ్లను,ఆకులను భుజించి జీవనం  చేసేవారిని 'ఫేనవులు'అంటారు.
సన్యాసులు:సొంతకుటీరంలో తగు కర్మలు ఆచరించేవారిని' కుటీచకులు' అని.కుటీరం లేకుండా కర్మలు నిర్వహించకుండా సంచరించేవారిని                ' బహుదకులు' అని,కేవలంజ్ఞానం మాత్రమే కలిగి సంచరించేవారిని 'హంసలని' జ్ఞానంకూడా పొందకుండా,పరబ్రహ్మ తత్వంలో లీనమయ్యేవారిని 'పరమహంసలు అంటారు.