దధీచి మహర్షి.పద్యకథ.: డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

బాలలు తీయ్యని నీరు కలిగిన బావి ప్రశాంతంగా ఉంటుంది.ఉప్పు నీరు కలిగిన సముద్రం అలలతో ఘోషపెడుతుంది.ఉత్తములు మౌనంగా ఉంటారు.అల్పులు ఎల్లవేళలా డాంబికాలు పలుకుతారు.
అరయ నాస్తి యనక,యడ్డు మాటాడక
తట్టు పడక మదిని తన్ను కొనక
తనది కాదను కొని తాపెట్టునదే పెట్టు
విశ్వదాభి రామ వినుర వేమ.
దానం ఎంత గొప్పదో అని తెలిపే కథయిది...
   బ్రహ్మమానసపుత్రులలో భృగుమహర్షి ఒకరు.ఇతని వంశంలో చ్యవన,జమదగ్ని,శుక్రాచార్యుడు,ధదీచి,పరశురాముడు,ఔర్యుడు,ఋచీకుడు వంటి పలువురు జన్మించారు.భృగుమహర్షికి పలువురు భార్యలు ఉన్నారు.కర్ధమప్రజాపతి కుమార్తె'ఖ్యాతి'అనే ఆమెను వివాహంచేసుకోగా ,దాత,విధాత,అనేకుమారులు,'శ్రీ'అనే కుమార్తె కలిగారు.మరోభార్య 'ఉశన' కు కవి,శుక్రాచార్యుడు,జన్మించారు. 'పులోమ'అనేమరోభార్యకు 'చ్యవనుడు' జన్మించాడు.ఇతనిభార్య'సుకన్య' వీరికి అప్రవాహనుడు,దధీచి అనేకుమారులు జన్మించారు.రాజకుమారి అయిన సుకన్యవన విహారం చేస్తూ  తపోదీక్షలో పుట్టలో ఉన్న చ్యవనుడి కళ్లు పొడవటంతో, అంధుడు, వృధ్ధుడు అయినప్పటికి ఆమెవలన అశ్వనిదేవతల సహాకారంతో దృష్టి, యవ్వనం పొందగలిగాడు.అలావారికి జన్మించిన వాడే దధీచి.ఇతను బాల్యంనుండే సరస్వతి నదీతీరంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు కొనసాగించ సాగాడు.ఇంద్రుడు పంపగా వచ్చిన కశ్యపునికుమార్తె 'ఆలంబున'నాట్యానికి మైమరచిన దధీచి సరస్వతి నదిలో  స్నానం చేస్తు ఇంద్రియ నిగ్రహం కోల్పోయాడు. ఆకారణంగా సరస్వతి నది గర్బంధరించి 'సరస్వత'అనే ఆనే బిడ్డడు జన్మించాడు.ఇంద్రుడు పలు శాస్త్ర సంబంధింత విషయాలు'ప్రవర్గ'అనేవిద్యను దధీచికి బోధించి ఈవిషయాలు ఎవరికైనా చెపితే నీతలతెగుతుంది అని హెచ్చరించి వెళ్లాడు.ఈవిషయం తెలుసుకున్న అశ్వనిదేవతలు దధీచి వద్దకువచ్చి'మహశయా నీతండ్రిఅయిన చ్యవనమహర్షికి దృష్టిని,యవ్వనాన్ని ప్రసాదించిన అశ్వనిదేవతలుమేము.ఇంద్రుడు నీకు తెలియజేసిన విషయాలు మాకుతెలిపితే వాటిని లోకకల్యాణానికి వినియోగిస్తాము'అన్నారు.తన ప్రాణాలకు ఉన్న ఆపదగురించి అడిగాడు దధీచి.'భయపడకండి ముందుగా మీతల తీసి గుర్రం తల అమర్చుతాము,నీవుఆవిషయాలు మాకుతెలిపినతరువాత నీగుర్రంతల రాలి పోగానే ఎప్పుడు ఉండేలా నీతలను నీకు అమర్చుతాము'అన్నారు అశ్వనిదేవతలు.గుర్రంతలతో ఇంద్రుడు తెలియజేసిన శాస్త్ర రహస్యాలను అశ్వని దేవతలకు తెలిపాడు దధీచి.వెనువెంటనే అతనికి అమర్చిన గుర్రంతల నేలరాలింది.యధావిధిగా అతని పూర్వపు తలను అమర్చి అశ్వనిదేవతలు వెళ్లిపోయారు. రాక్షసులను  సంహరించడానికి తన ఎముకలు ఆయుధాలుగా వినియోగ పడతాయని తెలుసుకుని ప్రాణత్యాగంచేసి దేవతలను యుధ్ధంలో గెలిపించేందుకు కారకుడు అయ్యాడు.