మనిషి నీ వయసెంత! నీ అవయవాల వయసెంత !: --ప్రతాప్ కౌటిళ్యా! AsstProf in Bio Chem(Rtd


  సాధారణంగా మనిషి వయసు ను హోమో సేపియన్స్ గా పుట్టినప్పటి వయసు మిగతా జీవుల నుంచి పరిణామక్రమంలో మనిషి గా ఎదిగి విడిపోయి మానవునిగా మనగలిగిన మనిషి వయసూ  లక్షల సంవత్సరాలు కావచ్చు.

      

         మనిషి వయసు మనం లెక్కించి గుర్తించినప్పుడు మానవజాతి వయసును చెప్పగలుగుతున్నాం. మానవ జాతి వయసు దాని తో సరి పెట్టలేము. ఎందుకంటే  మనుషుల్లోని వయసును నిర్ధారించిన ఆర్గాన్స్ అది తప్పని చెప్తుంది. మనిషిలోని అవయవాలు వాటి ఆధారంగా మనిషి  వయసును లెక్కిస్తే శాస్త్రీయంగా  మనిషి వయసును ప్రామాణికంగా నిర్ధారించి చెప్పినట్లు అన్న విషయం తప్ప అవుతుంది. మనసులోని అవయవాలు వాటి పరిణామం అవి మిగితా జీవుల నుంచి  పుట్టి కొనసాగిన అభివృద్ధి మార్పు ఆఖరి పరిణితి ఎంతో తేడాను ప్రత్యేక వయసును సూచిస్తుంది.ఒక్కో అవయవం దాని ప్రత్యేక పరిణామక్రమం ఆధునిక అభివృద్ధి ఒక్కో విధంగా ఉంటుందని శాస్త్రీయంగా చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. కన్ను సగటు వయసు దాదాపు 400 మిలియన్ సంవత్సరాలుగా గుర్తించారు మనిషిలోని గుండె కిడ్నీ లివరు సగటు వయసు లను, గుర్తించినట్లయితే శాస్త్రీయంగా మనిషి తన పూర్వీకుల పుట్టుక వయసు కన్నా అవయవాల వయసు ఎక్కువ అని తేలుతుంది. మనిషిగా పుట్టిన నాటి కన్నా ముందు కన్ను గుండె కిడ్నీ లివర్ పుట్టినవి.


 మనిషిలోని గుండె, కన్ను పూర్తిగామనగలిగే స్థితి మనిషికన్నా ముందునుండి ఉందన్న వయసు మన లెక్కలు తారుమారు చేస్తుంది. కిడ్నీ లివర్ కూడా వాటి వాటి పుట్టుక అభివృద్ధి వయసు వేరు వేరు గానే ఉంటుంది అని చెప్తున్నాం. కనుక ఇప్పుడు మనిషి పుట్టుక వయస్సును పూర్తిగా చెప్పలేం అన్నది మనం గుర్తించాలి. ఎందుకంటే మనసులోని ఒక్కో అవయవం దాని వయసును వేరువేరుగా శాస్త్రీయంగా గుర్తించినప్పుడు ఏ ఒక్క అవయవం అదనపు వయసు ద్వారా మనిషి వయసును మనం చెప్పలేము, కనుక మనుషుల్లోనే అన్ని అవయవాలు ఆఖరి వయసును మనం  నిర్ధారించ గలుగుతాం..  మెదడు కూడా మిగతా అవయవాల మాదిరిగానే ఒక ప్రత్యేక వయసును కలిగి ఉంటుంది. దాని ఆధారంగా ,  ఒక మనిషి వయసును కూడాకచ్చితంగా నిర్ధారించలేము.


 మనిషిలోని ఒక్కో అవయవం ఒక్కో వయసును సూచిస్తుంది. మనిషిగా  ఆవిర్భవించడానికి ముందు అన్నీ అవయవాలు అభివృద్ధి చెంది,  ఒక వయసును కలిగి ఉంటాయి అని మనం అనుకుంటాం కానీ దానికి విరుద్ధంగా ఒక్కో అవయవం పూర్తి వ్యతిరేక  వయసు లను కలిగి ఉంటాయని నమ్ముతాం ఇది నిజం.