ఆత్మస్థైర్యం పెంచుకో తల్లీ---వేముల ప్రేమలత--హైదరాబాద్

 'ఒక చెంపమీద కొడితే రెండో చెంప చూపించు' మన్నాను... కానీ
ఇప్పుడు  స్వాతంత్ర్యానికి ముందున్న రోజులు కావు తల్లి!
ఒక చెంప మీద కొడితే వాడి రెండు చెంపలు పగలగొట్టు
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకు, ఆత్మ విశ్వాసం పెంచుకో
వీలైనంతగా చదువుకో, నీకు నీవే ధైర్యం చెప్పుకో... సోదరీమణులకు ధైర్యం చెప్పు
అమ్మాయిలపై అఘాయిత్యం చేసే  మగ  మృగాల  బారి నుండి తప్పించుకునేందుకు ఆత్మ రక్షణ విద్యల్ని నేర్చుకో
'అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే
స్త్రీ కి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్నాను ' .... కానీ
ఇప్పుడు పట్టపగలు కూడా ఆడపిల్లలు ఒంటరిగా తిరుగలేకపోతున్నారు తల్లీ!
*ఇదిగో నా చేతికర్ర తీసుకో తల్లీ! నీకు నువ్వే పోరాడే సమయం ఇది*
మీ కోసమే కొన్ని చట్టాలున్నాయి... వాటిని
గురించి తెలుసుకో, తెలియని వాళ్లకు తెలియజేయి
దోషులకు తక్షణ శిక్షలు వేసి,
ఆ చట్టాలను సరిగ్గా అమలు పరిచే మంచిరోజులు వస్తాయని ఆశిద్దాం.