చరిత్రలో ....చిరంజీవి ..: -----డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,హన్మకొండ .

 సైకిలు రిక్షా ..
ఒకనాటిమాట !
ఆటోలకూ ..
రోజులు
 దగ్గరపడ్డాయి.,!
క్యాబ్ లు 
రాజ్యమేల బోతున్నాయి !
సామాన్యుడి 
సంపాదనా సాధనం 
కష్టపడటం అంటే 
ఏమిటో -
తెలియజెప్పే వాహనం !
కష్టపడే శ్రమజీవిని 
కళ్లెదుట చూపే 
మూఁడు చక్రాల 
ముచ్చటైన సైకిలు రిక్షా !
పేదవాడిని తెలిసినా 
అద్దెరిక్షా అని 
అతగాడు చెప్పినా ...
తక్కువకు బేరమాడి 
బేరంకుదుర్చుకున్న 
జ్ఞాపాకాల తడి 
ఇంకా ఆరనేలేదు !
రిక్షాలు మాత్రం -
అంతరించిపోయాయి ,
శ్రీ సి.నా .రె ,గీతంలో 
మాత్రం.....
చిరంజీవులై --
నిలిచాయి ....!!