' ఆ ' ఇద్దరు : టి. వేదాంత సూరి


 తెల్లవారి లేచింది మొదలు బయటకు వెళదాం అని ఆద్య , ఆరియా రెడీ అవుతున్నారు, సరే అనుకోని కాల కృత్యాలు తీర్చుకున్న తరువాత ఎప్పటి లాగే ఫోటో ల పార్క్ వెళ్లాలనుకున్నాం, మాకు వాకింగ్ కూడా అవుతుంది . పిల్లలు కదా. పక్కన పచ్చిక , ఫుట్ పాత్, రోడ్ ఉంటాయి, పిల్లలు అటు ఇటు పరుగెడుతుంటారు. వాళ్ళను నియంత్రిస్తూ ఉండాలి. 
మెల్లి మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ, ఆద్య కబుర్లు చెబుతూ, ఆరియా కేరింతలు కొడుతూ నడుస్తున్నారు, తీరా పార్క్ వద్దకు వెళ్లేసరికి చినుకులు పడటం ప్రారంభమయ్యాయి.. 
ఇక్కడ ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎంత వాన వస్తుందో తెలియదు, పార్క్ లో ఇద్దరు ఒక రౌండ్ పరుగెత్తిన తరువాత , వెను తిరిగాము, మాఇల్లు ఎదురుగా రోడ్ దాటగానే ఆద్య, ఆరియా మామయ్యా ఇల్లు వుంది, అక్కడికి పరుగులు తీశారు, అత్త , మామ, అక్కడి టి. వి. అంటే వారిద్దరికీ చాలా ఇష్టం, అక్కడ టి. వి. చూస్తూ బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని ఇంటికి వచ్చాం, ఆరియాకు  కొత్త కొత్త మాటలు వస్తున్నాయి, కొత్తమాట అనడం రాగానే దాన్నే పదే పదే పలుకుతుంది. నిన్నటి నుంచి పాపం అంటుంది. ప్రతి దానికి అదే మాట వల్లిస్తుంది .ఇదే పునశ్చరణ కావచ్చు, మంచి అలవాటే కదా.  
( మరిన్ని ముచ్చట్లు రేపు)