పాపపు మూట:--మొహమ్మద్. అఫ్సర వలీషా-ద్వారపూడి (తూ గో జి)..

 ఆ అరవిరిసిన గులాబీను 
చిదిమేటప్పుడు
 తెలియలేదు....
ఆ అందమైన ఆణిముత్యం
ఛిధ్రం చేసేటప్పుడు
 తెలియలేదు.....
కన్నూ మిన్నూ కానక
కనులముందరిదే రంగుల
లోకమనుకున్నా....
వావీవరస తెలియక
వారంతా తప్పటడుగులు వేసినా.....
ఆ ఆవేశాల 
పాలపొంగులు చల్లారి
ఆ ఆవేదనల పుటలు తెరచుకోగానే...
అనుక్షణం అనువైన క్షణాలు 
తమవే అని మురిసినా 
క్షణ క్షణం *మురిసిన పాపపు* మూట....
ఏనాడైనా విచ్చుకోక తప్పదు 
పాపపరిహారంగా మరణ
దండన వినక తప్పదు....