మూత్రపిండం ముడుచుకుపోవడం- నివారణ.: - పి . కమలాకర్ రావు

 కొంతమందికి పుట్టుకతోనే మూత్రపిండాల సమస్య మొదలయి పెరుగుతున్నకొద్దీ లక్షణాలు బయటపడతాయి.మూత్రపిండాలు పూర్తిస్థాయిలో పని చేయనందున ఇన్ ఫెక్షన్ కు గురవుతాయి. రెండు కిడ్నీల్లో ఏదో ఒకటి వ్యాధిగ్రస్తం అవుతుంది.  కిడ్నీ ముడుచుకుపోయి గట్టిగా తయారవుతుంది. మూత్రపిండాలకు జరిగే రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. నొప్పి, నులి, వచ్చి ఇబ్బంది పెడుతుంది.
 మరికొంతమందిలో చాలా అరుదుగా జన్మతః రాకపోయినా, పెరిగిన తర్వాత సమస్య వస్తుంది.
 అటుక మామిడి ఆకులు( ఎర్ర గలిజేరు) కొన్ని  బాగా కడిగి దంచి కొద్దిగా నీరు పోసి రసం తీయాలి. అలాగే తుత్తురు బెండ వేరును నల్ల గొట్టి రసం తీసి  ఇవి రెండు రసాలు కలిపి ప్రతిరోజు త్రాగాలి. దీనితో మూత్రపిండాలు బాగుపడతాయి.ఇదే కాకుండా పుచ్చ పండు, కీరదోస తింటూ ఉండాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే మూత్రపిండం ముడుచుకుపోవడం అనే వ్యాధి నయమవుతుంది.
ఎర్ర కాప్సికం (Red bell pepper )మూత్రపిండాల వ్యాధులు తగ్గడానికి సహాయపడుతుంది.