మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి


 తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ తొలి చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యు లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, సుధం లక్ష్మి, గద్దల పద్మ, కటారి రేవతీరావు కమిటీలో ఇతర సభ్యులు. కమిషన్‌ చైర్మన్‌తో పాటు ఆరుగురు సభ్యులూ పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐదేళ్లు పదవి లో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.( సాక్షి సౌజన్యం తో )