అమ్మ పుట్టిన ఇల్లు : యండమూరి వీరేంద్రనాథ్


 భద్రాచలం లో అమ్మ పుట్టిన ఇల్లు... నన్ను ప్రసవించిన  ఇల్లు... ఇప్పటికీ ఇంకా అలాగే ఉందని తెలిసి వెళ్లి చూశాను. 70 సంవత్సరాల వయసులో ఒక మంచి అనుభూతి. హైలీ 'రూట్స్' గుర్తొచ్చింది. మొత్తం స్థలాన్నీ , ఇంటినీ, తాతగారు ఏదో స్కూల్ కి డొనేషన్ ఇచ్చారట. ఇల్లు అలాగే ఉంది.


హైదరాబాద్ నుంచి అంత దూరం తీసుకెళ్ళిన  మిత్రుడు వాసుకి కృతజ్ఞతలు. 

కిన్నెరసాని పై బోటు. విశ్వనాధవారూ... వెన్నెల పక్కేసిన వేటూరీ గుర్తొచ్చారు.


 విగ్రహారాధన మీద  నమ్మకం లేకపోయినా  రాముడి వ్యక్తిత్వం చాలా ఇష్టం. నాతోపాటు  వచ్చిన మిత్రులకి చాలా భక్తి. దాదాపు 20 సంవత్సరాల  రాములోరిని  మళ్లీ చూడటం.  సీతా సమేత రాముడు బావున్నాడు. కర్పూరం వాసన. పక్కనే  గోదారి.  మంచి ఫీల్.   ఆలయ అధికారులు,  అర్చకులు  ఆత్మీయంగా చూసుకున్నారు. డ్రెస్ కోడ్ ఉన్నదట.


అక్కడినుంచి వెంకటాపురం  వెళ్లాను.  మా అమ్మమ్మ  పుట్టిన ఊరు అది. కానీ ఇల్లు ఎక్కడో తెలియలేదు. 


మంచి అనుభూతిని అనుభవాన్ని ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్నతలు.