గతానికి...గుడ్బై,--రేపటికి స్వాగతం.....!!(నానీలు):-----డా.కె.ఎల్.వి.ప్రసాద్, హన్మ కొండ.

 పెద్దలు చెప్పిన -
పంచాంగం చూసి ,
కిసుక్కున నవ్వింది 
ఇరవై ..ఇరవై ..!!
-------------------------
విర్రవీగే మనుష్యులకు 
విరుగుడు -
చూపించింది ,
ఈ సంవత్సరం ..!!
------------------------------
ఉష్ణదేశాల్లో ,
దానికి ఉపిరి -
అందదన్నారు !
కరోనా కాలు దువ్వింది గా !!
------------------------------------
గతాన్ని ఇక -
మరచిపోదాం !
కొత్త సంవత్సరాన్ని ,
కొత్తగా ఆహ్వానిద్దాం !!
---------------------------------------
ఆశాజీవులుగా 
బ్రతుకుదాం ...!
భవితకు -నీరాజనం 
పలుకుదాం ...!!
------------------------------------------
ఆంగ్ల సంవత్సరాది 
విశ్వజనులకు 'ఉగాది '!
అందుకె -
అహ్వానిద్దాం రండి !!
-------------------------------------------
         --