పొడుపు కథలు:--డా. కందేపి రాణి ప్రసాద్

 1 బెల్లపు పాకం బియ్యప్పిండి
జేగురు రంగు గుండ్రని రూపు
సంక్రాంతికి వచ్చే వంటకం
2 చుట్టలు చుట్టలు గా ఆకారం
చుట్టాల్లో పాకం ప్రసారం
3 అనేక మడతలు పెట్టి
అండాకారంలో చుట్టి
కాకినాడకు పేరు తెచ్చి
కమ్మగా నోరూరిస్తుంది
4 మెత్తదనం, తియ్యదనం
నునుపుదనం, కొత్తదనం
పానకంలో ఇదే గోళీలు
జవాబులు
1 అరిశ 2 జిలేబి 3 కాజా 4 గులాబ్ జామ్