ఆరోగ్యాన్ని కాపాడే కంద (పుల్ల కంద ) -పి . కమలాకర్ రావు


 కంద ( పుల్ల కంద )మన  ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పుల్ల కంద లో లేత ఎరుపు మరియు  తెలుపు, రెఁడు  రకాలు. తెలుపు కంద  దురద ఎక్కవ, ఎరుపు కందలో దురద  తక్కువ. ఎంతో రుచిగా  వుండే కందను, కంద పులుసు, కంద బచ్చలి, కంద వేపుడు అనే  వంటకాలను  శుభ కార్యాలలో చాలా కుటుంబాలలో వండుతారు

.కంద దురద తగ్గడానికి  చింత పండు రసం  విరుగుడు.

 కందను ముద్దగా దంచి  కీళ్ల నొప్పులపై రాస్తే  పై వాపులు తగ్గి పోతాయి.కందతో సూప్ తయారీ విధానం .  ఒక  గిన్నెలో నువ్వుల నూనె వేసి కందను ముద్దగా దంచి వేసి  అందులో అల్లం, దాల్చిన చెక్క, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి వేపి నీరు పోసి   మరిగించి  సూప్ గా తయారు చేయాలి.  ఇది త్రాగితే  ఉబ్బసం వ్యాధికి మంచి మందు. ఛాతి లోని  కఫం బయటకు వస్తుంది. మగవారికి ప్రొస్టేట్ వాపు తగ్గుతుంది. గుండె లోని , మెదడు లోని  అన్ని రకాల బ్లాక్స్ పోతాయి. స్త్రీలకు ప్రతి నెల పీరియడ్స్ లో వచ్చే  తల నొప్పి, చిరాకు, తగ్గి పోతుంది.