జ్ఞానోదయం (బాలల గేయ కథ): -గురువు శక్తి-శిష్యుని భక్తి


 నిత్య సద్గుణ సంపన్నుడు

భవిత తెలుపు నా సద్గురుడు

 శివాజీ హితము కోరునతడు

సమర్ధ రామదాసు గురుడు//

   మురంబదేవ గిరిపై కోట 

   ముందుచూపుతో నిర్మింప

   నూతనముగా రాజ కోట 

   శివాజీ నిర్మాణము బూనెను//

ఇరువదివేల పనివారలు

రేయింబవళ్ళు శ్రమ చేయ 

తగినట్లుగా సదుపాయములు

శివాజీ మహారాజు చూడగా//

    ఏమి నాదు గొప్పతనం

    ఆకలి  తీర్చు    నైజం

     పనివారల పెంచగలను 

     నేనే కదా దేవుడను//

మీసము మెలి వేయుచున్న

శివాజీనపుడు గనెను 

అతని మందిని పరికించి

సమర్ధ గురువు శంకించి//

       శిష్యునికి ధర్మము తెలుప

       పని వాళ్లను పిలిపించె

      బండ శిలను తెప్పించె

       నట్ట నడుముననే ఉంచె//

గురుని చేతల వింత 

శిష్యునికి మదినంత 

ఏమిటా యని చింత

ఆత్రంగా మరికొంత//

          సమర్ధ రామదాసుడంత

          శిల్పిని పిలిపించె నపుడు

          బండ నడుమ ఒక చోటను

          ఉలిపట్టి కొట్ట మనియె//

కఠిన శిల ముక్కలూడి

చిన్న కన్నము చూడ

కొద్ది నీళ్లు నడుమ

చిరు కప్ప బయట పడె//

        గురువు చేష్టను చూసి

       శివాజీ మదిని మెదిలె

       బండ శిలయందు కప్ప

       జలము పోసి పోషింప//

 ఎవ్వరి తరము కాదు కదా!

ప్రతి జీవిని పోషింపదగు

విశ్వ కర్తయే కదా!మరి

గురువు పాదాలపై పడెనపుడు//

        -బెహరా ఉమామహేశ్వరరావు*

          సెల్ నెం:9290061336: