దేవుడిచ్చిన వరం.: - యామిజాల జగదీశ్
 యమధర్మరాజు ఓమారు భూలోకానికి వచ్చాడు. ఆ రాకలో ఆయన ఓ అందమైన అమ్మాయిని చూసి తన మనసంని ఇచ్చేసుకున్నాడు.
ఆమె ఓ మానవ యువతి అయినప్పటికీ
ఆమెను పెళ్ళి చేసుకుని కొంత కాలమైనా జీవించాలనుకున్నాడు.
అనుకున్నట్టే ఆమెను పెళ్ళి చేసుకున్నాడు.  ఓ మగబిడ్డకు తండ్రయ్యాడు యమధర్మరాజు.
ఆయన పెళ్ళి చేసుకున్న అమ్మాయి మంచి అమ్మాయే. అయితే రోజులయ్యేకొద్దీ యముడికి ఆమెమీద మోజు తగ్గింది.
 తన లోకానికి వెళ్ళిపోయి ఆమెను వదిలేద్దామనుకుంటాడు. కానీ కొడుకుమీది పాశంతో యముడు వెళ్ళలేకపోతాడు.
కొడుకు కాస్తంత పెద్దవాడయ్యాడు. అతనితో మాట్లాడాడు....
పుత్రా, నువ్వు గొప్ప వైద్యుడు కావాలని నా కోరిక. ప్రాణంపోయే దశలో ఉన్నవారిని నువ్వు కాపాడగలగాలి. ఎలాగో తెలుసా? 
ఒకరు మరణించడబోతున్నాడనగానే నేను అక్కడికి వస్తాను. నీ కంటికి మాత్రమే నేను కనిపిస్తాను. నేను అక్కడ ఉన్నానంటే వారికి నువ్వు వైద్యం చెయ్యకూడదు. నువ్వు వైద్యం చేసి వారు మరణిస్తే నీ కీర్తి దెబ్బతింటుంది. కనుక ఎవరికి వైద్యం చేసినా నేను అక్కడ లేనంటే ధైర్యంగా మందులుగట్రా ఇవ్వు. అతను బతికేస్తాడు.
దానివల్ల నీ కీర్తి మరింత పెరుగుతుంది అన్నాడు యముడు.
భార్యతో చెప్పకుండా కొడుకుని కౌగిలించుకుని కన్నీటిపర్యంతమై అక్కడి నుంచీ వెళ్ళిపోయాడు. 
కొడుకు వైద్యశాస్త్రం చదివి తన సేవలతో పేరుప్రఖ్యాతులు గడించాడు.
అతను వైద్యం చేస్తున్నప్పుడు ఎటువంటివారైనా బతికేస్తున్నాడు.
ఒక్కడూ చావలేదు. అందరూ ఆశ్చర్యపోయారు.
 ఎవరికైనా వైద్యం చేయాలనుకున్నప్పుడు 
ఎదురుగా తన తండ్రి(యముడిని) చూస్తే దణ్ణం పెట్టి బయటకు వచ్చేసేవాడు.
 ఈ వైద్యుడు చేయి వదిలశాడంటే ఆ మవ్యక్తికి మరణం తథ్యం అని ఊరు ఊరంతా అనుకోసాగింది.
 కొన్నిరోజులకు ఆ ఊరి రాజుగారి కుమార్తె జబ్బుపడింది.
ఎందరు వైద్యులు చూసినా ఫలితం లేకపోయింది.
చివరికి ఇతనిని పిలిపించారు. తన కుమార్తెనం కాపాడమని రాజు కోరాడు.
అలా కాపాడితే ఆమెతో నీకు వివాహం జరిపిస్తానంటాడు రాజు. అంతేకాదు, ఐర్ధ రాజ్యాన్నిస్తానన్నాడు.
అనంతరం అతను రాకుమారి నిద్రపోతున్న గదిలోకి వెళ్ళాడు.
అక్కడ తన తండ్రి (యముడు) కనిపించాడు. 
 కనుక తాను వైద్యం చేసినా ఈ అమ్మాయి బతకదనుకున్నాడతను. కానీ ఆమె బతికితే ఆ అందమైన రాకుమారిని పెళ్ళి చేసుకోవడంతోపాటు ఓ అర్ధ రాజ్యానికి రాజు కావచ్చనుకున్నాడు. కానీ తండ్రి అడ్డుగా నిల్చున్నాడు.
తండ్రి అయిన యముడిని ఎలా అక్కడి నుంచి పంపించెయ్యాలా అనుకున్నాడు. ఆలోచించాడు. ఇంతలో ఓ మెరుపులాటి ఆలోచన తట్టింది.
వాకిలివైపు చూసి అరిచాడు.
అమ్మా ! నాన్న లోపలే ఉన్నారు. చొలా కాలం నించీ నాన్న కనిపించడం లేదని వెతుకుతున్నావు కదూ....ఇదిగో ఇక్కడున్నారు....అని అరిచాడు.
అంతే...మరుక్షణం యముడక్కడ కనిపిస్తే ఒట్టు. అతను వైద్యం చేయడం, రాకుమారి వైద్యానికి స్పందించి లేచికూర్చోడం....ఆమెకు ఈ వైద్యుడు అవడం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి.
అందుకే అంటుంటారు కట్టుకున్నది యముడైనా లేక మరెవరైనా కావచ్చు ....భార్యకు భయపడేతీరాలి. భార్య కలగడమంతా ఆ దేవుడిచ్చిన వరం.