యుద్ధం జరుగుతోంది. అర్థరాత్రి నక్కలు ఊళ్లోకొచ్చి కోళ్లనీ మేకపిల్లల్నిబాతుల్నీ ఎత్తుకు పోతున్నా ఊళ్లో కుక్కలు ఏం చేస్తున్నాయని ఊరి పెద్దలు మమ్మల్ని తిడుతున్నారనీ కుక్కలు వాదోప వాదాలకు దిగాయి.మన అరుపులకు పెద్దోళ్ళకు నిద్రాభంగ మవుతోందని నిందలు వేస్తున్నారని వాపోయాయి.ఇంతకీ నక్కల ఫిర్యాదు ఏమిటంటే ఊళ్లో జనం గుట్టల్లో ఉన్నచెట్లూ తుప్పలు కంపలు నరికి పట్టుకు పోతున్నారనీ మరుగు ఆవాసంలేకుండా అల్లాడి పోతున్నాం , వేటాడటానికి చెవుల పిల్లుల్నీ ఉడుముల్నీముంగిసలు ఉడతలు వేటగాళ్లు వలలు వేసి పట్టుకు పోతూంటే మేంఆకలితో మాడి పోతున్నాం అంటూ ఊళ్లో జనం మీ కుక్కలకి గంజీఅన్నం పండగ లపుడు బొమికలు పడేసి మేపుతున్నారు. మరి మాఆకలి తీరే దెలా అంటూ సతమత మవుతున్నాయి. మధ్యలో ముళ్లపందులు ఊరి మీద పడి పొలాల్లో చిలగడ దుంపలు శనక్కాయలు ఒలుచుకు పోతున్నాయి.అవీ కూడా మాకు తిండిలేకుండా చేస్తున్నాయి.ఈ సమస్య తేలక ఇటు ఊరి కుక్కలూ అటు గుట్టల్లో నక్కలు పొలిమేరల కొచ్చి రోజూ వాగ్వివాదం చేసు కుంటున్నాయి. రోజులుగడుస్తున్నాయి.ఒక పరిష్కార మార్గంగా తోడేళ్ళు ఒక ఆలోచన చేసాయి.ముళ్లపందుల్ని ఊళ్లోకి రాకుండా ఉపాయం ఆలోచించాయి. కొన్ని కుందేళ్లను భయపెట్టి ముళ్ల పందులుండే పరిసరాల వైపు పరుగెత్తించాయి. వేటగాళ్లు చెవులపిల్లుల కోసం వెళ్లగా ముళ్ల పందుల గుంపులు కనిపించాయి.వేటగాళ్లువారి వద్ద ఉన్న వలల్ని విసిరి బంధించి తీసుకు పోయారు.ఈ లోపున గ్రామ ప్రజలు వర్షాకాల ఆరంభ మవగానే హరిత హారంపేరున పెద్ద ఎత్తున మొక్కల్ని గ్రామం చుట్టూ పెంచడం మొదలెట్టారు.వాటి వల్ల వృక్ష సంపద పెరిగి జంతు జాలానికీ రక్షణ ఆహారం లభించింది.కోతులు నెమళ్ళు విష సర్పాలు ఊరి మీదకు రాకుండాకట్టడి జరిగింది.గ్రామ సింహాలు నిజంగా అడవి సింహాల్లా చెవులు నిలబెట్టుకునితిరుగు తున్నాయి. ఊళ్లో జనం ప్రశాంతంగా నిద్రపోతున్నారు.* * *
సయోధ్య: -- కందర్ప మూర్తి , కుకట్ పల్లి , హైదరాబాద్.