పూవులు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 పూవులమ్మ పూవులూ

రంగురంగుల పూవులూ

తోటలోనిపూవులూ తెంపితెచ్చాము

పళ్ళెముతోపూవులూ పట్టుకొచ్చాము

బండిమీదపూవులూ పోసుకొచ్చాము

ఒద్దికతో ఈపూవులు వేయిపూవులు

రెమ్మలతో ఈపూవులు రెండువేయిలూ

ముచ్చికలతో ఈపూవులు మూడువేయిలూ

నవ్వేటి ఈపూవులు నాల్గువేయిలూ

ఆకులతో ఈపూవులు ఆరువేయిలూ

తొడిమలతో ఈపూవులు తొమ్మిదివేయిలూ

పూవులతో మీరంతా పూజలుచేయండీ

మాకోరికలు తీరాలని దేవుడిని కోరండీ !!