ఆగమనం : -----డా.కె .ఎల్వీ - హనంకొండ .


 డిశంబర్ నెల 

వచ్చింది ....

క్రిస్మస్ సందడి 

తెచ్చింది ....!


జీసస్ జన్మదినం 

విశ్వ జనావళికి 

ఆశాకిరణం ...!


ప్రేమ -త్యాగాలను 

ప్రేరేపించే దినం 

వాటి అవసరాన్ని 

గుర్తుచేసే -

సుదినం ......!


పాప ప్రక్షాళనలో 

అందరికోస మ్

తనజీవితాన్ని 

త్యాగం చేసిన 

కరుణామయుడి 

ఆగమన ---

శుభసమయం !

క్రిస్మస్ ...

పండుగ సమయం !!

---------------------------              

ఫోటో లో....

తాత తో....ఆన్షి*