'ఆ ' ఇద్దరు : - టి. వేదాంత సూరి


 పిల్లల్లో రాగ ద్వేషాలు వుండవు. ఒకరినొకరు కలిసి పోతారు.  వారిలో కోప, తాపాలు, ద్వేషాలు రాకుండా చూడవలసిన బాధ్యత పెద్దలది. ఎవరైనా విమర్శ చేసినా, చాడీలు చెప్పినా వెంటనే వారికి నచ్చ చెప్పాలి. అలా ఆలోచించ వద్దని విడమరచి చెప్పాలి. 
ఆద్య, ఆరియా వెల్లింగ్టన్ వెళ్లారు కదా, అక్కడ ఆద్య తన వయసులో వుండే యుధిష్ట కూడా వుంది. వెళ్ళగానే కాస్తా మొహమాట పడినా తరువాత, ఆద్ద్య, యుధిష్ట కలిసి పోయారు. ఇద్దరికి బొమ్మలు వేయడం అంటే చాలా చాలా ఇష్టం, అందుకే బొమ్మలు వేసుకుంటూ రాత్రి వరకు కాలక్షేపం చేశారు. ఆక్లాండ్ కూడా రాను ఇక్కడే యుధిష్ట తో ఆడుకుంటాను అందట ఆద్య. అంటే పిల్లలో పిల్లలు ఎలా కలిసి పోతారో ఈ సంఘటన తెలుపుతుంది.  ఇక ఆరియా ఇంట్లో వున్నా బొమ్మలన్నీ విచ్చల విడిగా విసిరి కొడుతూ చిందర వందర చేస్తూ ఆడుకుంటుంది. ఆమెకు విసుగు వస్తే ఇష్టమైన పెప్ప పిగ్ టి. వి. లో పెట్టుకుంది. యధావిధిగా వాట్స్ అప్ లో పలకరిస్తుంది. కేరింతలు కొడుతోంది. 
పిల్లలకు ఇల్లు ఎవరిదైనా పిల్లలకు తేడా ఉండదు. ఎవరు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించరు . వారిని అడ్డుకుంటే చిన్నారి మనసు బాధ పడుతుంది. కానీ వారిని మాత్రం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటె వారికి ఇది మంచి, దీని వలన ప్రమాదం అని తెలియదు కదా. 
ఈ రోజు వెల్లింగ్టన్ లో పార్లమెంట్ భవన్ , వేరే ఇతర ప్రాంతాలను చూసే అవకాశం వుంది. 
( మరిన్ని ముచ్చట్లు రేపు )