ఉడుత::- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 
ఉడుతా ఉడుతా ఓఉడుతా
బుడిబుడి నడకల ఓఉడుతా
ఎక్కడికెళ్ళావ్ ఓఉడుతా?
ఏమి చేశావ్ ఓఉడుతా?
రాముని సేవకు వెళ్ళాను
వానరమూకతొ కలిశాను
వారధి నేను కట్టాను
భక్తితొ భజనలు చేశాను
రాముడు నన్ను మెచ్చాడు 
చెంతకు రమ్మని పిలిచాడు
మూడు నామాలు ఇచ్చాడు
ముచ్చటగా నన్ను చూశాడు
ఆశీస్సులను ఇచ్చాడు !!