రామాయణం రాసింది పిల్లలే, బొమ్మలు వేసింది పిల్లలే, రేపు పుస్తకావిష్కరణ చేసుకునేది పిల్లలే మీరు ఆశీర్వదించండిదక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ లో నాలుగవ తరగతి చదువుతున్న అద్విక్ రాపోలు రాసిన అద్విక్ రామాయణం ఈ నెల 27వ తేదీ నల్లగొండ జిల్లా చిట్యాల లో ఆవిష్కరణ జరగనున్నది. పిల్లలే ఆవిష్కర్తలుగా పిల్లలే వక్తలుగా వినూత్నంగా జరగనున్న ఈ ఆవిష్కరణ సభలో సభాధ్యక్షులుగా పదవ తరగతి చదువుతున్న మెండె సహస్ర వక్తలుగా ఈ గ్రంథానికి చిత్రాలు అందించిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని హరి నందన చిలుకూరి, చిన్నారులు అబ్దుల్ రవుఫ్ అహ్మద్, పాటి భానుజ, పందిరి లాస్య, సాగర్ల శ్రీ వర్ధన్ మరికొంతమంది చిన్నారులు పాల్గొననున్నారు.